శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr

ఉప్పల్ ట్వంటీ20 మ్యాచ్ రద్దు.. 23 నుంచి టిక్కెట్ల డబ్బు పంపిణీ

భారత్ - ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 13న జరగాల్సిన చివరి టీ20 వర్షం రాకపోయినప్పటికీ మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దుతో అభిమానులు నిరుత్

భారత్ - ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 13న జరగాల్సిన చివరి టీ20 వర్షం రాకపోయినప్పటికీ మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దుతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో దిగి వచ్చిన నిర్వాహకులు టికెట్ డబ్బులు ఇస్తామని ప్రకటించారు. 
 
తాజాగా ఈ నెల 23 నుంచి టికెట్ డబ్బులను తిరిగి చెల్లించాలని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. అభిమానులు తమ ఒరిజినల్ టికెట్లు, బ్యాంక్ ఖాతా వివరాలతో ఉప్పల్ స్టేడియానికి రావాలని కోరింది. 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో 23, 24 తేదీల్లో రూ.800, 25, 26 తేదీల్లో రూ.1000, 27, 28 తేదీల్లో రూ.1500, 30, 31 తేదీల్లో రూ.5000 టికెట్ల డబ్బులను ఆర్‌టీజీఎస్ ద్వారా రిఫండ్ చేస్తామని తెలిపింది. అలాగే హాస్పిటాలిటీ, కార్పొరేట్ బాక్సుల టికెట్ల డబ్బులను ఎప్పుడు చెల్లించేది త్వరలో ప్రకటిస్తామని అపెక్స్ కౌన్సిల్ వెల్లడించింది.