శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (10:03 IST)

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ.... కుక్క ఎవరు?... పులి ఎవరు?

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయింది. కోహ్లీ సేన కేవలం ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, బంగ్లాదేశ్ క్రికెటర్లతో పాటు.. ఆ

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయింది. కోహ్లీ సేన కేవలం ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా, బంగ్లాదేశ్ క్రికెటర్లతో పాటు.. ఆ దేశ నెటిజన్లకు సైతం సరైన గుణపాఠం నేర్పింది. 
 
సెమీఫైనల్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌ ఫ్యాన్స్‌‌ సోషల్ మీడియా ద్వారా చేసిన చిల్లర పనికి తగిన బుద్ధి చెప్పింది. బంగ్లాదేశ్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం ఒక వికెట్ కోల్పోయిన భారత జట్టు బంగ్లాదేశ్‌పై అద్భుతమైన విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియా వార్ లో టీమిండియా అభిమానులు విజయం సాధించారు.
 
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ తమ వక్రబుద్ధిని చాటుకుంటూ భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. భారత్‌ను కుక్కతో పోల్చుతూ, బంగ్లాదేశ్‌ను పులితో పోల్చారు. అంతటితో ఆగలేదు. బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో ఉన్న పులి.. భారత త్రివర్ణ పతాకంతో ఉన్న కుక్కను వేటాడుతున్నట్టు ఫొటో మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు వారందరికీ మెన్ ఇన్ బ్లూ గట్టిగా గుణపాఠం చెప్పారు. మరోసారి ఇలాంటి పిచ్చివేషాలు వేయకుండా ఘన విజయంతో వారి నోరు మూయించారు.
 
బంగ్లాదేశ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించడంతో.... సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు... ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ! పులి ఎవరు? కుక్క ఎవరు? అంటూ బంగ్లాదేశ్ అభిమానులను ఎద్దేవా చేస్తున్నారు.