శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (13:18 IST)

ప్రపంచ కప్: నాలుగు వికెట్లను కోల్పోయిన విండీస్..!

ప్రపెంచ కప్‌ పోటీలలో భాగంగా గ్రూప్‌ బీలో భారత్‌తో జరుగుతున్న వన్డేలో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 15 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 54 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు తొలుత దూకుడును ప్రదర్శించింది. తొలి ఓవర్‌లోనే ఐదు పరుగులు సాధించింది. 
 
ఆహా అనుకోగానే ఎనిమిది పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ విసిరిన బంతికి డ్వేన్ స్మిత్ ఔట్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ఆ తర్వాత 15 పరుగుల వద్ద విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. 7వ ఓవర్‌లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌‌లో గేల్స్ మిడ్ ఆన్ మీదుగా ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని తొలిత పట్టులోలేక పోయినా, తర్వాత దానిని మోహిత్ శర్మ  విసరడం, విరాట్ కోహ్లీ ఈ బాల్ అందుకుని వికెట్లను గిరటేయడంతో... శామ్యూల్స్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత బరిలో దికిన శామ్యుల్స్ రెండు పరుగులకు ఔట్ కాగా,  తర్వాత క్రీజ్‌పైకి వచ్చిన రామ్దీన్ పరుగుల ఏమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టారు. దీంతో వెస్టిండీస్ జట్టు 15 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 54 పరుగులు చేసింది.