శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (13:05 IST)

4 వేల రన్స్ క్లబ్‌లో బంగ్లా క్రికెటర్ షకిబ్ : ఆప్ఘనిస్థాన్ టార్గెట్ 268 రన్స్!

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2015లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హాసన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగు వేల పరుగుల క్రికెట క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ క్లబ్‌లో చేరిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ కావడం గమనార్హం.
 
ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. కాన్ బెర్రాలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో షకిబ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆఫ్ఘన్ బౌలర్ ఆఫ్తాబ్ ఆలమ్ విసిరిన ఇన్నింగ్స్ 37వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించడం ద్వారా ఈ లెఫ్ట్ హ్యాండర్ 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 
 
అతని తర్వాతి తమీమ్ ఇక్బాల్, మహ్మద్ అష్రాఫుల్, ముష్ఫికర్ రహీం, షహర్యార్ నఫీస్ ఉన్నారు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే... బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 267 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
దీంతో బంగ్లా బ్యాట్స్‌మెన్లలో వికెట్ కీపర్ అయిన రహీం (71) అద్భుతంగా రాణించగా, ఓపెనర్లు హక్యు 29, ఇక్బాన్ 19, సర్కర్ 28, మహ్మదుల్లా 23, షాకిహ్ అల్ హాసన్ 63, మోర్తాజా 14 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 13 రన్స్ వచ్చాయి. దీంతో ప్రత్యర్థి ముంగిట 268 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.