శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (17:51 IST)

ఐసీసీ ర్యాంకింగ్స్: 9వ ర్యాంకులో పుజారా.. విరాట్ కోహ్లీ రికార్డు.. నాలుగో స్థానం..

విశాఖ టెస్టులో ఇంగ్లండ్ జట్టును భారత్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో

విశాఖ టెస్టులో ఇంగ్లండ్ జట్టును భారత్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ(167, 81) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 50 టెస్టుల తన కెరీర్‌లో 800 పాయింట్ల మార్కును కోహ్లీ తొలిసారిగా అధిగమించి రికార్డు సాధించాడు. 
 
అలాగే ఈ ఘనత సాధించిన 11వ భారత క్రికెటర్‌గానూ నిలిచాడు. విశాఖ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేసిన ఛతేశ్వర్‌ పుజారా పది నుంచి తొమ్మిదో ర్యాంకుకు మెరుగుపరుచుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో రవీంద్ర జడేజా ఆరో ర్యాంకుకు ఎగబాకాడు. అశ్విన్‌ మొదటిస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే... ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ ఉన్నాడు. ఇక టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్టేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ తొలిస్థానంలో ఉండగా, జోరూట్ ‌(ఇంగ్లాండ్‌), కనె విలియమ్‌సన్‌(న్యూజిలాండ్‌) తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నారు.