Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాళ్లు పాకిస్థాన్‌ను చిత్తు చేశారు... వీరు వెస్టిండీస్‌ చేతిలో ఓడారు

సోమవారం, 3 జులై 2017 (09:46 IST)

Widgets Magazine

భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడిస్తే.. భారత క్రికెట్ జట్టు మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లు ఆదివారమే జరిగాయి.
womens cricket team
 
మహిళల ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై 95 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగా, ఆస్కోరును ఛేదించే క్రమంలో పాకిస్థాన్ జట్టు 74 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు బిష్ట్ 5 వికెట్లు, జోషి 2, గోస్వామి, శర్మ, కౌర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. 
 
అలాగే, కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న టీమిండియా.. ఆదివారం అంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్లు లూయిస్ 35, హోప్‌ 35 ఎస్‌హోప్‌ 25 ర‌న్స్‌ స్కోరు చేయగా, భారత బౌలర్లు ఉమేష్ 3, పాండ్య 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. భారత జట్టు బ్యాట్స్‌మెన్లు రహానే 60, ధోని 54, పాండ్య 20 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లు హోల్డర్ 5, జోసెఫ్ 2, విలియమ్స్, బిషూ, నర్స్ తలో వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఐదు వికెట్లు తీసిన హోల్డర్ నిలిచాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సెహ్వాగ్‌, రవిశాస్త్రి మధ్యే పోటీ. కోచ్ అయితే మాత్రం సెహ్వాగ్ నోరు కట్టేసుకోవాల్సిందే

టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి కూడా రేసులోకి రావడంతో సెహ్వాగ్‌, రవిశాస్త్రి, ...

news

స్పిన్నర్లు తిప్పేయడంతో 93 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం

కరీబీయన్ గడ్డపై విజయం ఇంత సులభమా అన్న చందంగా టీమిండియా బౌలర్లు విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ...

news

పరుగులు సరే సరి.. టపాటపా రాలుతున్న వికెట్లు.. విండీస్ 27 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న ...

news

ఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 పురుగులు

ఆంటిగ్వాలో జరుగుతున్న మూడో వన్డేలో 40 ఓవర్ల వరకు విండీస్ బౌలర్లు భారత బ్యాటింగ్ శ్రేణికి ...

Widgets Magazine