Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాకిస్థాన్ నడ్డివిరిచిన ఏక్తాబిస్త్.. 74 పరుగులకే చాపచుట్టేసింది.. ఛాయ్‌వాలా కూతురైనప్పటికీ?

బుధవారం, 5 జులై 2017 (10:54 IST)

Widgets Magazine

మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో  పురుషుల టీమిండియా జట్టును ఓడించిన పాకిస్థాన్‌పై మహిళల భారత క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఏక్తాబిస్త్ నిలిచింది. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 
 
ఈ ఏక్తాబిస్ ఎవరంటే ఓ ఛాయ్ వాలా కుమార్తె. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ చేసిన ఏక్తా బిస్త్ కేవలం 18 పరుగులిచ్చి పాకిస్థాన్‌పై కీలక ఐదు వికెట్లు పడగొట్టింది. ఈ మ్యాచ్‌తో ఏక్తా బిస్త్ స్టార్‌గా మారింది. ఉత్తరాఖండ్‌‌లోని అల్మోరాకు చెందిన ఏక్తాబిస్ తండ్రి కుందన్‌ సింగ్‌ బిస్త్‌ ఛాయ్‌వాలా.  అంతకుముందు ఇండియన్‌ ఆర్మీలో హవల్దార్‌‌గా పనిచేసి 1988లో ఆయన రిటైర్‌ అయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయనకు పింఛనుగా 1500 రూపాయలు చేతికి వచ్చేవి. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో.. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాడు. 
 
ఆరేళ్ల వయసులోనే ఏక్తా క్రికెట్‌పై అభిమానం చూపించేది. అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. దీంతో ఆమె కలను సాకారం చేసేందుకు ఆయన టీస్టాల్ ప్రారంభించారు. వచ్చే సంపాదనతోనే కుమార్తెకు అన్నీ సమకూర్చేవాడు. దీంతో అత్యుత్తమ ప్రతిభతో ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ టీమ్‌‌కు ఎంపికైంది. ధీటుగా రాణించిన ఆమె 2006లో ఆ జట్టుకు కెప్టెన్సీ సారథ్యం వహించింది. 
 
2007 నుంచి 2010 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టు తరఫున ఆడింది. 2011లో జాతీయ జట్టులో స్థానం సాధించింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అనంతరం ఆమెకు స్పాన్సర్స్ దొరకడంతో కుటుంబ ఆర్థిక కష్టాల నుంచి బయటపడింది. ఇప్పుడు పాకిస్థాన్‌ మ్యాచ్ తరువాత ఏక్తా బిస్త్ స్టార్ క్రికెటర్‌గా మారింది. బిస్తాపై ప్రశంసలు వెల్లువెత్తడంతో ఆయన తండ్రి కుందన్ సింగ్ సంతోషానికి అవధుల్లేవ్. 
 
ఇకపోతే.. మహిళల ప్రపంచ కప్‌లో గత ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 169 పరుగులే సాధించినప్పటికీ.. పాకిస్థాన్‌పై 95 పరుగుల తేడాతో విజయాన్ని సంపాదించిపెట్టింది... ఎవరో తెలుసా? లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఏక్తా బిస్తే. తన పది ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులే ఇచ్చి అయిదు వికెట్లతో పాకిస్థాన్ నడ్డివిరించింది. బిస్త్‌ ధాటికి పాక్‌ 38.1 ఓవర్లలో 74 పరుగులకే చాపచుట్టేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bisht India Pakistan 95 Runs England Third Successive Victory Icc Women's World Cup

Loading comments ...

క్రికెట్

news

టీమ్‌కే చేతగాని చోట ధోనీమీద పడితే ఏం లాభం.. కసురుకున్న గవాస్కర్

లక్ష్య ఛేదనలో వరుసగా ఫెయిలవుతున్న మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియాలోంచి పీకేయాలని విమర్శలు ...

news

కోహ్లీ టీమ్‌కు బాగా తలంటిన సంజయ్ బంగార్.. మహిళా జట్టు స్పూర్తితో ఆడాలంటూ దెప్పులు

కుంబ్లేని కోచ్ పదవి నుంచి సాగనంపింది మొదలుకుని వివాదాలతో సాగుతున్న టీమిండియా పయనం ...

news

చనిపోయే లోపైనా మనవడిని ముద్దాడాలని వుంది.. ఆ క్రికెటర్ తాత

'అపుడు నేను చేసిన తప్పు క్షమించరానిదే. ఇపుడు చేసిన తప్పు ఎంత పెద్దదో తెలుసుకున్నా. నేను ...

news

మహిళా క్రికెట్లో మెరుస్తున్న మణి దీపం స్మృతి మంధన

భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్‌ ...

Widgets Magazine