Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి ఎఫెక్ట్ : పడిపోయిన కోహ్లీ ర్యాంక్

మంగళవారం, 26 డిశెంబరు 2017 (12:29 IST)

Widgets Magazine
virat - anushka

కొత్త పెళ్లికొడుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది. పెళ్లి కారణంగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరం కావడంతో ఆ ప్రభావం తన ర్యాంకుపై పడింది. ఫలితంగా మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారాడు. అదేసమయంలో మొదటి ర్యాంకును ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ కైవసం చేసుకున్నాడు. 
 
తాజాగా వెల్లడైన ఐసీసీ ర్యాంకుల జాబితాలో భారత క్రికెట్ జట్టు మాత్రం తన ర్యాంకుని మెరుగుపరుచుకుంది. తాత్కాలిక కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ సారథిగా విజయాలు సాధించడమే కాదు.. బ్యాటుతోనూ చెలరేగిపోయాడు. దీంతో ఇంగ్లండ్‌, ‌న్యూజిల్యాండ్‌, వెస్టిండీస్ జట్లను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలబడింది. పాక్ మొదటి స్థానంలో ఉంది. 
 
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు ముందు టీమిండియా ఖాతాలో 119 పాయింట్లు ఉండగా.. సిరీస్‌ తర్వాత 121 పాయింట్లకు పెరిగిందని, దీంతో టీమిండియా రెండో ర్యాంకును సొంతం చేసుకుందని ఐసీసీ తెలిపింది. ఇక 124 పాయింట్లతో పాకిస్థాన్ మొదటిస్థానంలో కొనసాగుతుంది.
 
పెళ్లి కారణంగా లంక సిరీస్‌కు దూరమవ్వడంతో ఈ ఎఫెక్ట్ కోహ్లీ టీ-20 ర్యాంకింగ్స్‌పై పడింది. దీంతో కోహ్లి ర్యాంకు మొదటి స్థానం నుంచి మూడోస్థానానికి పడిపోయింది. టీ-20 సిరీస్‌కు దూరమైన కారణంగా కోహ్లీ పాయింట్లు 824 నుంచి 776కు పడిపోయాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
India Slips Virat Kohli 2nd Place T20 Rankings

Loading comments ...

క్రికెట్

news

మేమేం పిచ్చోళ్లం కాదు.. ధోనీ ఫిట్నెస్ అమోఘం : రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వస్తున్న విమర్శలపై టీమిండియా ...

news

మేం పిచ్చోళ్లం కాదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆపండి: రవిశాస్త్రి వార్నింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలపై టీమిండియా కోచ్ ...

news

సౌతాఫ్రికాకు వన్డే టీమ్ సెలక్షన్ : షమీకి పిలుపు.. రాహుల్ ఔట్

భారత క్రికెట్ జట్టు ఈనెలాఖరులో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు ...

news

లగ్జరీ కారులో అమ్మాయికి లిప్‌లాక్ కిస్ ఇస్తూ అడ్డంగా బుక్కైన క్రికెటర్

నాథన్ లియాన్. తన మణికట్టు మాయాజాలంతో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. వైవాహిక ...

Widgets Magazine