1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (13:17 IST)

ధోనీ ఖాతాలో మరో రెండు రికార్డులు.. శ్రీలంకతో నాలుగో వన్డేనే వేదిక?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కూల్ కెప్టెన్ ధోనీ కొత్త రికార్డులకు దగ్గరలో వున్నాడు. శ్రీలంకతో గురువారం నాలుగో వన్డే జ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కూల్ కెప్టెన్ ధోనీ కొత్త రికార్డులకు దగ్గరలో వున్నాడు. శ్రీలంకతో గురువారం నాలుగో వన్డే జరుగనున్న నేపథ్యంలో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పనున్నాడు.

ఇప్పటికే వికెట్ కీపర్, స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా జట్టులో స్ధానం సంపాదించిన ధోనీ గురువారం జరిగే వన్డేతో తన కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన వ్యక్తిగా రికార్డు పుటలకెక్కాడు. 
 
వికెట్ కీపర్‌కు ఇది సుదీర్ఘ కెరీర్ కావడం విశేషం. అలాగే ధోనీ ఇప్పటి వరకు 99 స్టంపింగ్స్ చేసి సంగక్కరను అధిగమించాడు. మరొక్క స్టింపింగ్ చేస్తే మరో రికార్డు అతని ఖాతాలో చేరుతుంది. బ్యాటింగ్ సమయంలో ధోనీ నాటౌట్‌గా ఉంటే...అత్యధిక మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా రికార్డు పుటలకెక్కుతాడు. 
 
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌‍ల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధోనీ రెండో వన్డేలో ఆశ‌లన్నీ వ‌దిలేసుకున్న స‌మ‌యంలో టెయిలెండ‌ర్ భువీతో క‌లిసి అసాధార‌ణ ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వ‌న్డేలోనూ రోహిత్‌తో క‌లిసి టీమ్‌ను గెలిపించాడు.

అంతేకాదు ఈ సిరీస్‌లోనే టీమిండియా త‌ర‌ఫున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మ‌న్‌గానూ ధోనీ నిలిచాడు. ఇప్పటివరకు 299 మ్యాచులు ఆడిన ధోనీ 9608 ర‌న్స్ చేశాడు. కేవ‌లం స‌చిన్ (18426), గంగూలీ (11221), ద్ర‌విడ్ (10768) మాత్ర‌మే ధోనీ క‌న్నా ముందున్నారు.