రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

శనివారం, 7 అక్టోబరు 2017 (16:59 IST)

ravindra jadeja

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా  గత ఏడాది డిసెంబరులో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జడేజా తన సోదరితో కలిసి నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంట్‌లో నాణ్యత లేదంటూ వార్తల్లో నిలిచింది. రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు శుక్రవారం జడేజా రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌లో ఎక్కువ కాలంపాటు నిల్వ వుంచిన ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులను కనుగొన్నారు. వీటిపై ఫంగస్ ఏర్పడటాన్ని కూడా గుర్తించారు. పరిమితికి మించి ఫుడ్‌ కలర్స్‌, అజినోమోటో వినియోగిస్తున్నట్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీఆర్‌ రాథోడ్‌ వెల్లడించారు. 
 
ఈ రెస్టారెంట్లో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులపై గడువు తేదీ కూడా లేకపోవడం.. పాడైపోయిన కూరగాయలను గుర్తించిన సిబ్బంది వాటిని సీజ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పక్కనపెట్టి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న జడేజా సోదరికి అధికారులు నోటీసులు అందజేశారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ...

news

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ...

news

స్టీవ్ స్మిత్‌కు గాయం.. ఆందోళనలో ఆస్ట్రేలియా?

భారత్‌తో ట్వంటీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ...

news

ఇంటివాడు కాబోతున్న భారత పేసర్ భువనేశ్వర్ కుమార్

భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు ...