శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (13:29 IST)

మిచెల్ మార్ష్ అవుట్- ఆపరేషన్ అనివార్యమైతే.. పూణే సూపర్ జెయింట్స్‌కు షాక్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరం కానుండటంతో పూణేకు ఇబ్బందులు తప్పేలా లేవు. బెంగళూరు టెస్టులో గాయ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ మార్ష్ తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరం కానుండటంతో పూణేకు ఇబ్బందులు తప్పేలా లేవు. బెంగళూరు టెస్టులో గాయపడిన మార్ష్ మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. మార్ష్‌కు ఆపరేషన్ అనివార్యం కావడంతో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న యాషెస్‌ సిరిస్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
 
అయితే వచ్చే వారంలో వైద్యనిపుణలను మార్ష్ సంప్రదించే అవకాశముందని తెలుస్తోంది. శస్త్రచికిత్స గనుక అవసరమైతే దాదాపు 9 నెలల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ పదో సీజన్‌కు కూడా మార్ష్ దూరం కానున్నాడు. గత సీజన్లో అతను పూణేకు ప్రాతినిధ్యం వహించాడు. 2009లో కూడా మిచెల్ మార్ష్ గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.