శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2015 (15:59 IST)

ఐపీఎల్ 8వ సీజన్: ఢిల్లీపై రాజస్థాన్ విన్.. 3 వికెట్ల తేడాతో గెలుపు!

ఐపీఎల్ 8 సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓ దశలో ఓటమి తప్పదని భావించిన తరుణంలో దీపక్ హుడా (25 బంతుల్లో 54) మలుపు తిప్పేశాడు. క్రిస్ మోరిస్ (6 బంతుల్లో 13 నాటౌట్), సౌథీ (4 బంతుల్లో 7) కూడా జట్టుకు విజయం సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. 
 
ఓపెనర్ రహానే (39 బంతుల్లో 47), చివర్లో ఫాల్క్‌నర్ (11 బంతుల్లో 17) విజయానికి పాటుపడ్డారు. ఢిల్లీ బౌలర్ ఇమ్రాన్ తాహిర్ (4/28) శ్రమ నీటి పాలైంది. అమిత్ మిశ్రా 2, మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు శ్రేయాస్ అయ్యర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 37)తో పాటు డుమిని (38 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పూర్తి ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు సాధించింది. 
 
తొలి మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ (17 బంతుల్లో 2 సిక్స్‌లతో 27) ఫర్వాలేదనిపించాడు. మాథ్యూస్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్ 2, తంబే ఓ వికెట్ పడగొట్టారు. హుడాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.