శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (18:47 IST)

ఐపీఎల్-10.. విరాట్ కోహ్లీ నాలుగు మ్యాచ్‌లకు డౌటే.. పూర్తి ఫిట్‌నెస్ తర్వాతే?

ఐపీఎల్- పదో సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ ఐపీఎల్‌ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ ధ

ఐపీఎల్- పదో సీజన్ కోసం ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథి కోహ్లీ ఐపీఎల్‌ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. రాంచీ టెస్టులో గాయపడిన కోహ్లీ ధర్మశాల టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ధర్మశాల మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, కొన్నివారాల పాటు తాను ఐపీఎల్‌కు దూరమవుతానని చెప్పాడు. గాయం నుంచి ఇంకా కోలుకోలేదన్నాడు. 
 
100శాతం ఫిట్‌నెస్‌ సాధించడానికి ఇంకా కొన్ని వారాల సమయం పడుతోంది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే మైదానంలో అడుగుపెడతానని కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఎప్పటికి కోలుకుంటానో తెలియట్లేదన్నారు. గాయంపై త్వరలో ఫిజియో స్పష్టత ఇస్తాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు.  దీంతో ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌తో, 8న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో, 10న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మూడు మ్యాచ్‌లకు కోహ్లీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.