Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ధోనీ స్వయంగా తప్పుకుంటాడా.. గౌరవంగా సాగనంపుతారా?

హైదరాాబాద్, శనివారం, 4 ఫిబ్రవరి 2017 (02:25 IST)

Widgets Magazine

కొన్ని సంకేతాలు ఒక పట్టాన అర్థం కావు. ఇంగ్లాండ్‌తో ఆఖరి ట్వంటీ-20 తర్వాత ధోనిని సత్కరించి ఓ బహుమతిని అందించింది. అంతేకాకుండా ధోని ఓ మేటి కెప్టెన్‌ అని పేర్కొంటూ భారత జట్టుకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు చెప్తూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇది ధోనీ సేవలకు కృతజ్ఞతలు తెలుపడమా లేక ఇక వెళ్లడానికి సిద్దంకా అంటూ ముందస్తు సూచన పంపడమా..  బీసీసీఐ అంతరార్థం ఏమిటో తెలీక ధోనీ అభిమానులు జుట్టుపీక్కు చస్తున్నారు. 
 
ఒకటి మాత్రం నిజం. ధోనీ క్రికెట్ జీవితం చరమాకంలో పడినట్లే. ఎన్ని మెరుపు పరుగులు తీసినా, ఎన్ని స్టంప్ ఔట్లు చేసి ఔరా అనిపించినా, మైదానంలో కెప్టెన్‌ను మించిన స్ఫూర్తితో జట్టు ఫీల్డింగ్ స్థానాలు మార్చినా ధోనీ ఇక ఎక్కువకాలం టీమిండియాలో ఉండడు అనేది ఖాయం. ధోనీ తనకు తాను సడన్‌గా వైదొలుగుతున్నట్లు ప్రకటించి షాక్ ఇవ్వకుండా ఉండడానికి బీసీసీఐనే ఈసారి చొరవ  తీసుకుని తనకు సత్కారం కూడా చేసేసినట్లు అందరికీ అర్థమవుతోంది.
 
భారత క్రికెట్‌కు అపూర్వ విజయాలు అందించి, తన పేరును ఓ బ్రాండ్‌గా మార్చుకున్న భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కెరీర్‌ ఇక ముగిసినట్లేనా. ధోని వన్డే కెప్టెన్సీకు విడ్కోలు చెప్పిన కొద్ది రోజుల్లోనే ధోనీ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతారనే వార్తలు వచ్చాయి. 
 
తాజాగా బీసీసీఐ చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి బలం చేకూర్చుతున్నాయి. ఇదే నిజమైతే ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ-20 మ్యాచే ధోనికి ఆఖరుదవుతుంది. టెస్ట్, వన్డే కెప్టెన్సీల నుంచి తప్పుకుంటున్నట్లు ఆకస్మికంగానే ప్రకటించిన ధోని.. రిటైర్మెంటుపై మెరుపు ప్రకటన ఎప్పుడు చేస్తాడో చూడాలి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఇంగ్లండ్ ఆటగాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించారు : ఆసీస్‌కు పీటర్సన్ వార్నింగ్

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వార్నింగ్ ఇచ్చాడు. ...

news

పరుగులన్నీ నేనే చేస్తే మిగతావాళ్లేం చేస్తారటా: ప్రెస్ మీట్ ‌లో రెచ్చిపోయిన కోహ్లీ

రాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు పయనం నల్లేరు మీద నడకలా సాగుతోంది. ఇంగ్లండ్‌ జట్టుతో ...

news

అతడి నుంచి నేర్చుకుంటాను, నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటూనే ఉంటాను : అని అన్నదెవరు?

టీమిండియాలో కోహ్లీ, ధోనీ మధ్య సమన్వయం, సాన్నిహిత్యం ఆటగాళ్ల మధ్య అనుబంధాల సరిహద్దులనే ...

news

క్రికెటర్ సురేష్ రైనా సిక్సర్‌ బంతికి అంత పవరుందా? ఏం జరిగిందంటే...

భారత క్రికెట్ జట్టులో అలవోకగా సిక్సర్లు బాదే ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకడు. ఎడమచేతివాటం ...

Widgets Magazine