శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 మే 2016 (12:57 IST)

గాయాలతో లసిత్ మలింగకు కష్టాలు.. సీపీఎల్ నుంచి అవుట్.. కెరీర్ ఓవర్?!

గాయాలతో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే గాయం కారణంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ముందుగానే ప్రకటించిన మలింగ.. మరో టోర్నీకి కూడా దూరమవుతున్నట్లు ప్రకటించాడు. సీపీఎల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు మలింగ ప్రకటించినట్లు తెలుస్తోంది. సీపీఎల్‌లో జమైకా తల్లావాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. 
 
ఈ నేపథ్యంలో గాయం కారణంగా అతడి స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌కు ఛాన్స్ దక్కింది. ముంబై ఇండియన్స్ జట్టులో చేరినా మలింగ ఐపీఎల్ 9వ సీజన్లో పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో గాయం కారణంగా జూన్ 30 నుంచి ఏడో తేదీ వరకు జరిగే సీపీఎల్‌కు కూడా అతడు దూరం కానున్నాడు. గాయాల కారణంగా ఆసియా కప్, ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీలకు కూడా మలింగ దూరమైన సంగతి తెలిసిందే. 
 
కాగా గాయాలతో వరుసగా మలింగ బిగ్ టోర్నీలకు దూరం కావడంతో అతని కెరీర్ ముగిసినట్టేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. గాయాల కారణంగా సుదీర్ఘంగా క్రికెట్‌కు దూరమవుతున్న మలింగ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని వారంటున్నారు.