శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (10:24 IST)

ధోనీని తొలగించాలని డిమాండ్.. కపిల్ దేవ్ ఏమన్నాడంటే?

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ధోనీ ట్వంటీ-20 జట్టులో కొనసాగడమా లేకుంటే రిటై

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ధోనీ ట్వంటీ-20 జట్టులో కొనసాగడమా లేకుంటే రిటైర్ కావడమా అనే విషయంపై చాలా రోజులుగా చర్చ సాగుతోంది.
 
కానీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. వీరితో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ధోనీకే మద్దతిచ్చారు. అయితే క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ సహా మరికొందరు మాత్రం ఆయన జట్టులో నుంచి వైదొలిగి జూనియర్లకు అవకాశం ఇవ్వాలని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ ట్వంటీ-20 జట్టులో కొనసాగించాలా వద్దా అనే అంశంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ధోనీ ఆటతీరుపై తాను కామెంట్స్ చేస్తే.. అది అందరినీ తికమకపెట్టే అవకాశం ఉంది. అందుకే ధోనీ సెలక్షన్ విషయాన్ని మనం సెలక్టర్లకే వదిలేద్దామని పేర్కొన్నారు.