Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నన్ను తిట్టరు.. ధోనీపై నిందలా?: విరాట్ కోహ్లీ ఫైర్

గురువారం, 9 నవంబరు 2017 (10:10 IST)

Widgets Magazine
dhoni - kohli

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్వంటీ-20 నుంచి విరమించి.. మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించిన నేపథ్యంలో.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ధోనీని వెనకేసుకొచ్చాడు. ధోనీపై విమర్శలు గుప్పించేవారిపై మండిపడ్డాడు. తాను విఫలమైనప్పుడు నోరెత్తని వాళ్ళు.. ధోనీని మాత్రం విమర్శిస్తారెందుకని ప్రశ్నించాడు. ధోనీ ఫిట్‌గా వున్నాడని... ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసవుతున్నాడని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు. మైదానంలో ప్రతి వ్యూహం వెనుకా ధోనీ పాత్ర ఉంటుందని చెప్పాడు
 
న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలలో 25, 18, 25, టీ-20ల్లో 7, 49 పరుగులు మాత్రమే ధోనీ చేశాడు. మూడో టీ-20లో ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై సీనియర్ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో తను విఫలమైన వేళ, పల్లెత్తు మాటని వారు.. ధోనీని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యాడు. 
 
ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు విమర్శలు చేస్తున్నారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ధోనీ బరిలోకి దిగుతున్న స్థానం, అప్పుడు ఉండే పరిస్థితిని గురించి ఆలోచించకుండా, అతని శక్తి, నైపుణ్యాలపై నిందలు వేయడం సరికాదని హితవు పలికాడు. ధోనీ  బ్యాటింగ్ దిగే సమయానికి ఒత్తిడి వుంటుందని.. తాను మూడుసార్లు బ్యాట్స్‌మెన్‌గా విఫలమైతే ఏమీ అనని వారంతా.. ధోనీని వేలెత్తి చూపుతున్నారని ఆరోపించాడు. ధోనీ చేసిన తక్కువ స్కోర్లపై తనకు ఎటువంటి ఆందోళనా లేదన్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్.. డిన్నర్లో సీఫుడ్స్ వుండాల్సిందే: కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ ...

news

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ ...

news

న్యూజిలాండ్ చిత్తు... ట్వంటీ-20 సిరీస్ భారత్ కైవసం

ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు మంగళవారం రాత్రి తిరువనంతపురం వేదికగా ...

news

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ ...

Widgets Magazine