శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (10:43 IST)

ప్రపంచకప్ ఎలెవన్‌కు కెప్టెన్‌గా మెక్‌కల్లమ్: ఐసీసీ ప్రకటన

ఐసీసీ ప్రపంచకప్ ఎలెవన్ జట్టులో భారత్-పాకిస్తాన్ ఆటగాళ్లకు స్థానం లభించలేదు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ సారథి క్లార్క్ కాకుండా న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్‌నే కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

‘దూకుడైన ఆటతీరే కాకుండా వినూత్న, స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఈ మెగా టోర్నీలో మెకల్లమ్ ఆకట్టుకున్నాడు. అందుకే ఈ జట్టుకు అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశాం’ అని ఐసీసీ పేర్కొంది. టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో రాణించిన ఆటగాళ్లను పలువురు క్రీడా నిపుణులు కలిసి ఓ జట్టుగా ఎంపిక చేశారు.
 
ఇక ప్రపంచకప్ ఎలెవన్ జట్టు వివరాలను పరిశీలిస్తే.. మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, స్మిత్, అండర్సన్, వెటోరి, బౌల్ట్, సంగక్కర (వికెట్ కీపర్), డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, స్టార్క్,  మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ ఆటగాడు).