Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అరుదైన గౌరవానికి అల్లంత దూరంలో.. ఇది మిథాలీ షో టైమ్

హైదరాబాద్, మంగళవారం, 18 జులై 2017 (01:41 IST)

Widgets Magazine

ఒక భారతీయ మహిళా క్రికెటర్ ప్రపంచ క్రీడా యవనికలో శిఖర స్థాయిలో నిలవనున్న క్షణాలివి. అన్నీ అనుకూలిస్తే... ఇదే భీకర్ ఫామ్‌ను ఆమె ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రపంచ కప్ ఫైనల్ ముగిసేలోగానే వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకోవచ్చు. ఆ అరుదైన క్షణాల కోసం దేశంలోని క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. 
 
భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకునేందుకు అతి కొద్ది దూరంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా వన్డే ర్యాంకింగ్స్  జాబితాలో మిథాలీ రాజ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో టాప్‌కు చేరడానికి ఐదు పాయింట్ల దూరంలో నిలిచింది మిథాలీ. ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లతో మిథాలీ రెండోస్థానంలో నిలిచింది.
 
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మిథాలీ ఆకట్టుకుంది. అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. తద్వారా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని నంబర్ వన్‌కు చేరువగా వచ్చింది. 
 
నంబర్ వన్ ర్యాంకులో నిలవడానికి కేవలం ఐదు పాయింట్ల దూరంలో మిథాలీ నిలిచింది.  ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (779) టాప్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే, మిగతా భారత మహిళా క్రికెటర్లు ఎవరూ టాప్-10లో నిలవక పోవడం గమనార్హం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

సెహ్వాగ్‌కు కూడా గుండు కొట్టింది కోహ్లీనేనా... ఏం బతుకురా స్వామీ నీది..!

టీమిండియా కోచ్‌ పదవి ఎంపిక వెనుక జరిగిన పరిణామాలు ఒక్కొక్కటీ బయటపడుతూంటే మన జట్టులో ...

news

విరాట్ కోహ్లీకి ఏమాత్రం తీసిపోని ప్రతిభ ఆమె సొంతం. అయినా ఎందుకీ వివక్ష

టీమిండియా పురుషుల జట్టు సాధించలేని అరుదైన విజయాన్ని మన మహిళా క్రికెట్ జట్టు ...

news

భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగా.. రణతుంగ వ్యాఖ్యపై సీనియర్ల ధ్వజం

కోట్లాది భారతీయ క్రికెట్ అభిమానులు అవమానంతో దహించుకుపోయేలా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ ...

news

పదేళ్ల ఒప్పందం ముగిసినా ధోనియే మా కెప్టెన్.. నిజమైన యాజమాన్యం అంటే అదే మరి

భారత క్రికెట్ చరిత్రలో అప్రతిహత విజయాలను సాధించిపెట్టిన అద్భుత కెప్టెన్ అతడు. మహేంద్ర ...

Widgets Magazine