Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్ కోహ్లీ... డబుల్స్‌లో లారాను దాటేశాడు...

ఆదివారం, 3 డిశెంబరు 2017 (11:49 IST)

Widgets Magazine
virat kohli

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల జోరు కొనసాగుతోంది. ఇఫ్పటికే సెంచరీల మోతలో.. పరుగుల వరదలో రికార్డులు బ్రేక్ చేస్తున్న కోహ్లీ…  ఆదివారం మరో రికార్డును చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 
 
ప్రస్తుతం శ్రీలంకతో ఢిల్లీలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించాడు. 238 బంతులు ఆడిన కోహ్లీ… 84.50 స్ట్రైక్ రేట్‌తో డబుల్ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ కాగా… కెరీర్‌లో ఆరోది. అంతకు ముందు నాగ్‌పూర్ టెస్టులో కూడా డబుల్ సెంచరీ చేశాడు కోహ్లీ. అత్యధికంగా డబుల్ ధమాకాలు సృష్టించిన టెస్టు క్రికెటర్‌లలో కోహ్లీది 12వ స్థానం. 
 
కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన లారా రికార్డును బ్రేక్ చేశాడు. లారా కెప్టెన్‌గా ఐదు డబుల్ సెంచరీలు చేయగా… కోహ్లీ ఆరు చేశాడు. కోహ్లీ కంటే ముందు టాప్ ప్లేస్‌లో డొనాల్డ్ బ్రాడ్‌మెన్ (12), సంగర్కర(11), లారా(9), హేమండ్(7) ఉండగా… భారత క్రికెటర్లలో సచిన్(6), సెహ్వాగ్(6)ల సరసన విరాట్ కోహ్లీ నిలిచాడు. 
 
ఇకపోతే, కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు (6) సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డుకెక్కాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (5) రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే భారత్‌ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు సచిన్, సెహ్వాగ్ చెరో ఆరు డబుల్ సెంచరీలు సాధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బీసీసీఐ చుట్టు వివదాలు.. పరిష్కారం కోసం రూ.4900 కోట్లు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చుట్టూ కుప్పలుతెప్పలుగా వివాదాలు ఉన్నాయి. వీటిని ...

news

కోహ్లి మరో రికార్డు... 105 ఇన్నింగ్సులో 5000 పరుగులు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఫీట్ అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 5000 పరుగులు ...

news

మీరు మీరుగా వుండండి: మానుషికి బదులిచ్చిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో విజయాలు, ...

news

డాక్టర్ యువరాజ్ సింగ్...

క్రికెటర్ యువరాజ్ సింగ్ డాక్టరయ్యాడు. అయితే, ఆయన నిజంగా వైద్యం చేసే డాక్టర్ మాత్రం కాదు. ...

Widgets Magazine