శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (15:43 IST)

క్రికెట్ పసికూన యూఏఈపై పాకిస్థాన్ విన్: నాకౌట్ ఛాన్స్ పదిలం!

ప్రపంచ కప్ లో తొలి రెండు మ్యాచుల్లో భారత్, వెస్టిండీస్ జట్లపై ఓడిపోయిన పాకిస్థాన్ క్రికెట్ పసికూనలపై సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. ఇటీవల జింబాబ్వేపై గెలిచి బోణి కొట్టిన పాక్, పసికూన యూఏఈపై జరిగిన బుధవారం మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించి విజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్ ప్రపంచ కప్ నాకౌట్ అవకాశాన్ని పదిలం చేసుకుంది.
 
నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు తీసిన పాకిస్థాన్ యూఏఈని 50 ఓవర్లలో 210-8 స్కోరుకే కట్టడి చేసింది. పాకిస్థాన్ జట్టులో మొదటి బ్యాటింగ్‌కు దిగిన అహ్మద్ షెహజాద్, హారిస్ సొహైల్ నిలకడగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 
 
ఇకపోతే.. ఈ ఏడాది ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు 300 స్కోరు దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాకిస్థాన్ జట్టులో షెహజాద్ (93), హారిస్ సొహైల్ (70) అర్ధ సెంచరీలతో రాణించగా, కెప్టెన్ మిస్బా (65) మెరుపులు మెరిపించాడు. యూఏఈ జట్టులో సైమన్ (62), ఖుర్రం ఖాన్ (43) అంజాద్ (40), స్వప్నిల్ పాటిల్ (36) రాణించారు.