శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:34 IST)

అశ్విన్ రికార్డ్ బ్రేక్.. యాసిర్ షా అదరగొడతాడా?

పాకిస్థాన్ యువ పేసర్ యాసిర్ షా (21) పేస్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. కుడిచేతి వాటంతో గంటకు 145 కిమీ వేగంతో బంతులు విసరగలడు. అలాగే ఎడమ చేత్తో 135 కిమీ స్పీడుతో బౌలింగ్‌ చేయగలుగుతాడు. పేదరికం నుంచి వచ్చ

పాకిస్థాన్ యువ పేసర్ యాసిర్ షా (21) పేస్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. కుడిచేతి వాటంతో గంటకు 145 కిమీ వేగంతో బంతులు విసరగలడు. అలాగే ఎడమ చేత్తో 135 కిమీ స్పీడుతో బౌలింగ్‌ చేయగలుగుతాడు. పేదరికం నుంచి వచ్చినా తనకున్న ప్రతిభతో క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారాడు. 
 
అండర్‌-19 వరల్డ్‌క్‌ప్‌లో శ్రీలంక స్పిన్నర్‌ కమిందు మెండీస్‌ ఇలాంటి ఫీట్‌ చేసి షాక్ ఇచ్చేలా చేశాడు. విదర్భ క్రికెటర్‌ అక్షయ్‌ కర్నేవార్‌ కూడా రెండు చేతులతో బౌలింగ్‌ చేయగల సమర్థుడు. కానీ రెండు చేతులతో పేస్‌ బౌలింగ్‌ చేయగలిగిన తొలి క్రికెటర్‌గా యాసిర్‌ రికార్డులకెక్కనున్నాడు. అండర్-10 మ్యాచ్ సందర్భంగా షా టాలెంట్ బయటపడింది. 
 
పాకిస్థాన్ మాజీ పేసర్‌ ఆకిబ్‌ జావెద్‌ నిర్వహించిన టాలెంట్‌ హంట్‌తో యాసిర్‌ పేరు మారుమోగిపోయింది. కాగా.. దక్షిణాఫ్రికా పేస్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌.. యాసిర్‌ ఆరాధ్యదైవం. షా బౌలింగ్‌ యాక్షన్‌ కూడా స్టెయిన్‌ను పోలి ఉంటుంది. ఇకపోతే.. అశ్విన్ రికార్డును షా బ్రేక్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.