రన్స్ - 0 ... వికెట్లు -10 : ఎవరా క్రికెటర్?

గురువారం, 9 నవంబరు 2017 (13:37 IST)

akash

క్రికెట్ ప్రపంచంలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఓ క్రికెటర్ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏకంగా పది వికెట్లు తీసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్‌కు చెందిన 15 ఏళ్ల లెఫ్టామ్ మీడియం పేసర్ ఆకాశ్ చౌదరి.. స్థానికంగా ఉండే దిశా క్రికెట్ అకాడమీ తరపున ఆడుతున్నాడు. భావర్ సింగ్ టీ20 టోర్నీలో భాగంగా పెర్ల్ అకాడమీపై మొత్తం 10 వికెట్లను ఆకాశ్ నేలకూల్చాడు. 4 ఓవర్లు వేసిన ఆకాశ్.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తొలి ఓవర్‌లో రెండు, ఆ తర్వాత రెండు ఓవర్లలో మరో రెండేసి వికెట్లు తీశాడు. ఇక చివరి ఓవర్‌లో ఓ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీశాడు. 
 
ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దిశా క్రికెట్ అకాడమీ 20 ఓవర్లలో 156 రన్స్ చేయగా.. పెర్ల్ అకాడమీ 36 పరుగులకే ఆలౌటైంది. అన్ని వికెట్లు ఆకాశ్ ఖాతాలోకే వెళ్లాయి. చివరికి ఆకాశ్ బౌలింగ్ ఫిగర్స్ ఇలా ఉన్నాయి... 4-4-0-10. 15 ఏళ్ల ఆకాశ్.. రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ బోర్డర్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందినవాడు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నన్ను తిట్టరు.. ధోనీపై నిందలా?: విరాట్ కోహ్లీ ఫైర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్వంటీ-20 నుంచి విరమించి.. మరో ఆటగాడికి అవకాశం ...

news

బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్.. డిన్నర్లో సీఫుడ్స్ వుండాల్సిందే: కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ ...

news

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ ...

news

న్యూజిలాండ్ చిత్తు... ట్వంటీ-20 సిరీస్ భారత్ కైవసం

ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు మంగళవారం రాత్రి తిరువనంతపురం వేదికగా ...