శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (17:46 IST)

గంగూలీ కామెంట్లకు రవిశాస్త్రి హర్టయ్యాడు: ఐసీసీ పదవికి రాజీనామా.. వ్యక్తిగత నిర్ణయమట!

టీమిండియా మాజీ కెప్టెన్, టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి మనస్తాపానికి గురైయ్యారు. ఇప్పటికే వ్యాఖ్యతగా, క్రికెట్‌ నిపుణుడిగా, కాలమిస్ట్‌గా వివిధ పాత్రలు పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న రవిశాస్త్రి.. ఐ

టీమిండియా మాజీ కెప్టెన్, టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి మనస్తాపానికి గురైయ్యారు. ఇప్పటికే వ్యాఖ్యతగా, క్రికెట్‌ నిపుణుడిగా, కాలమిస్ట్‌గా వివిధ పాత్రలు పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న రవిశాస్త్రి.. ఐసీసీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక.. జాతీయ కోచ్ పదవికి తనను ఎంపిక చేయలేదని.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బీసీసీఐ సలహా కమిటీలో సభ్యుడైన గంగూలీపై విమర్శలు గుప్పించాడు. ఇందుకు గంగూలీ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
 
భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం రవిశాస్త్రిని ఇంటర్వ్యూ చేసిన బృందంలో గంగూలీ లేకపోవడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గంగూలీ-రవిశాస్త్రిల మధ్య మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీలో మీడియా విభాగ అధికార ప్రతినిధిగా ఉన్న రవిశాస్త్రి తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
తానిప్పటికే ఐసీసీకి రాజీనామా లేఖను సమర్పించానని.. ఆరేళ్ల నుంచి తాను ఆ పదవిలో కొనసాగుతున్నందున.. ఆ పదవికి రాజీనామా చేయాలని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నానని రవిశాస్త్రి స్పష్టం చేశారు.