శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 14 జులై 2017 (05:34 IST)

బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ సరిపోడట.. ఆ మాట చెప్పడానికి రవిశాస్త్రి ఎవడు? టీమిండియాలో ముసలం ఇతడేనా?

టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడం జట్టు ప్రయోజనాలకు ముప్పు అనే ఉద్దేశంతో బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ని భారత క్రికెట్ సలహా మండలి నియమించింది. ఈ ఎంపికకు ప్రధాన కారకుడు సౌరవ్ గంగూలీ అన్నది తెలిసిన విషయమే. కానీ బ

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికై రెండు రోజులు కాలేదు. అప్పుడే చీలిక రాజకీయాలు మొదలైపోయి నట్లున్నాయి. టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడం జట్టు ప్రయోజనాలకు ముప్పు అనే ఉద్దేశంతో బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ని భారత క్రికెట్ సలహా మండలి నియమించింది. ఈ ఎంపికకు ప్రధాన కారకుడు సౌరవ్ గంగూలీ అన్నది తెలిసిన విషయమే. కానీ బౌలింగ్‌ కోచ్‌ ఎంపిక పట్ల హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అసంతృప్తిని బహిరంగంగా కక్కేసాడు. తనపై నిఘా ఉంచే వ్యక్తి కాకుండా తనకు మద్దతుగా ఉండే వ్యక్తిని బౌలింగ్ కోచ్‌గా నియమించాలని రవిశాస్త్రి ప్రకటించేశాడు కూడా. బీసీసీఐ సలహామండలి నిర్ణయాన్ని కూడా ధిక్కరిస్తూ రవిశాస్త్రి చేస్తున్న కామెంట్లు చూస్తుంటే బీసీసీఐ ఇంత నీరుగారిపోయిందా అనిపిస్తోంది.
 
భారత క్రికెట్‌ కోచ్‌ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బౌలింగ్‌ కోచ్‌ ఎంపిక పట్ల హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ఉండే వ్యక్తిని బౌలింగ్‌ కోచ్‌గా తీసుకోవాలని రవిశాస్త్రి భావిస్తున్నాడు. గతంలో భారత బృందానికి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్‌ అరుణ్‌ను తీసుకోవాలనే పట్టుపడుతున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడటానికి హెడ్‌ కోచ్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.  ఈ సందర్భంగా రవిశాస్త్రి బౌలింగ్‌ కోచ్‌ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రవిశాస్త్రి మాట్లాడారు. 'జహీర్‌ ఉత్తమైన బౌలర్‌. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ బౌలింగ్‌  కోచ్‌గా పనిచేయడానికి కావాల్సినంత అనుభవం మాత్రం లేదని' అన్నారు. అనుభవం లేకపోతే ఏంజరుగుతుందో కోచ్‌గా పనిచేసిని కుంబ్లే విషయంలో చూశాం' అని పేర్కొన్నాడు. కానీ భరత్‌ అరుణ్‌ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందన్నాడు. జహీర్‌ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అది సాధ్యపడుతుందా అని ప్రశ్నించాడు. 
 
ఒక వేళ కోచ్‌గా పనిచేసే ఉద్దేశం ఉంటే అరుణ్‌తో కలిసి సలహాదారుడిగా పనిచేయాలని రవిశాస్త్రి సూచించాడు. అదే విధంగా జహీర్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరపున తన బాధ్యతలనుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బోర్డుకు వృధా ఖర్చు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భారత జట్టు ప్రధాన​ కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ఖాన్‌ ఎంపికైన విషయం తెలిసిందే.
 
రవిశాస్త్రి అనే ఒక పచ్చి స్వార్ధపరుడిని సచిన్ టెండూల్కర్ అనే మరో సార్థపరుడు కోరి మరీ ఎంపిక చేశాక ముంబై క్రికెట్ ప్రపంచం ధిక్కారం, నిర్లక్ష్యం అనుభవించక తప్పదు కదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.