దాడులు మంచిది కాదు.. దేశానికి చెడ్డపేరు వస్తుంది : క్రికెటర్ అశ్విన్

బుధవారం, 11 అక్టోబరు 2017 (16:02 IST)

ravichandran aswin

భారత క్రికెట్ జట్టు ఓడిపోతే ప్రత్యర్థి ఆటగాళ్ళపై దాడులు చేయడం సహేతుకం కాదనీ, ఇలాంటి దాడుల వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుందని క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన భారత క్రికెట్ అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రయాణించే బస్సుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు పగిలిపోయాయి. 
 
ఈ ఘటనను భారత క్రికెట్ జట్టు బౌలర్ ఆర్.అశ్విన్ తప్పుబట్టాడు. బస్సుపై రాళ్లు రువ్వడం సరైన పని కాదని అన్నాడు. ఇలాంటి చర్యలు మన దేశానికి చెడ్డ పేరును తీసుకొస్తాయన్నాడు. అతిథులను గౌరవించడం మన సంప్రదాయమన్నాడు. అందరూ బాధ్యతాయుతంగా మెలగాలంటూ ట్వీట్ చేశాడు. దీనిపై మరింత చదవండి :  
Unhappy Rock Thrown Ravichandran Ashwin Australian Team Bus

Loading comments ...

క్రికెట్

news

చెత్తగా బ్యాటింగ్ చేశాం.. చిత్తుగా ఓడాం.. విరాట్ కోహ్లీ

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ...

news

విరాట్ కోహ్లీ సేన ఓడిపోయిందనీ... ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ళ వర్షం...

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ ...

news

బౌలర్లు ఓ ఆటాడుకుంటే... బ్యాట్స్‌మెన్స్ చితక్కొట్టారు.. ఓడిన కోహ్లీ సేన

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడి ...

news

నువ్వు సిక్కువా అని ప్రశ్నించిన నెటిజన్.. కౌంటరిచ్చిన హర్భజన్ సింగ్

టీమిండియా స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రాను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన ...