Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పింక్ డ్రెస్సే దక్షిణాఫ్రికా విజయానికి కారణమా? సోషల్ మీడియాలో వైరల్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (17:04 IST)

Widgets Magazine

భారత్‌తో శనివారం జరిగిన వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వరుణుడు ఈ మ్యాచ్‌ను అడ్డుకున్నా భారత్ పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుచుకున్న భారత్.. నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఏడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా ముందు 290 పరుగుల లక్ష్యాన్ని ఉంచినప్పటికీ, వర్షం కారణంగా ఆటకు బ్రేక్ వచ్చింది. 
 
డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 28 ఓవర్లకు 202 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచారు. కేవలం 25.3 ఓవర్లలోనే సౌతాఫ్రికా 207 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే ఈ విజయంపై సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే దిశగా.. ప్రతి సంవత్సరం ఓ మ్యాచ్‌ను గులాబీ రంగు దుస్తుల్లో దక్షిణాఫ్రికా ఆడుతుంది. 
 
ఈ డ్రెస్‌లో ఆడితే దక్షిణాఫ్రికా ఓడిపోదు. ఈ డ్రస్సు వల్లే దక్షిణాఫ్రికా గెలుపును నమోదు చేసుకుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇది రికార్డు పరంగా నిజమేనని క్రీడా పండితులు కూడా చెప్తున్నారు. ఈ మ్యాచ్‌తో కలిపి మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా పింక్ జర్సీలతో ఆడిన, అన్ని మ్యాచ్‌లను సొంతం చేసుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

శిఖర్ ధావన్ 100వ వన్డేలో మరో సెంచరీ... బ్యాటింగ్ కెరీర్ ఎలా వుందో తెలుసా?

శిఖర్ ధావన్ ఇవాళ తన 100వ వన్డేలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రియా-భారత్ జట్ల మధ్య ...

news

శిఖర్ ధావన్ 100.. కోహ్లీ 75 పరుగులకే అవుట్.. అయినా రికార్డుల పంట

దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్లు ...

news

సారా టెండూల్కర్ పేరుతో నకిలీ ఖాతా... ఏం చేశారో తెలుసా?

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ...

news

మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్న క్రికెటర్...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదేస్తున్నాడు. అది ...

Widgets Magazine