Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు.. పేస్ బౌలర్‌ని అభినందించా: ద్రవిడ్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:57 IST)

Widgets Magazine

అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా యువ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టుకు ద్రవిడ్ కోచ్ కావడంతో ఆయనపై క్రికెట్ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే అండర్ -19 ప్రపంచ కప్ సెమీఫైనల్లో గెలుపుకు అనంతరం రాహుల్ ద్రవిడ్ పాకిస్థాన్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్లు వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలపై రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. 
 
తనపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. కివీస్ నుంచి భారత్ చేరుకున్న రాహుల్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలని పాక్ జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ ఆహ్వానించాడని.. ఆయన కోరికను మన్నించి తాను వారి వద్దకు వెళ్లి మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. 
 
తాను పాక్ కుర్రాళ్లతో మాట్లాడలేదని, అయితే పాక్ ఆటగాళ్లలో ఓ ఎడమచేతి వాటం పేస్ బౌలర్‌ను అభినందించానని.. అది కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో కానే కాదన్నాడు. అదేవిధంగా పాక్ కోచ్ సైతం భారత ఆటగాళ్లను అభినందించాడని గుర్తు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
రాహుల్ ద్రవిడ్ పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ Coach Rahul Dravid India U-19 Pakistan Dressing Room

Loading comments ...

క్రికెట్

news

మా కుర్రాళ్లపై చేతబడి జరిగింది... అందుకే ఇండియాపై ఓడిపోయాం... పాక్ టీమ్ మేనేజర్

అండర్ 19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో టీమిండియా కుర్రాళ్ల చేతుల్లో అత్యంత దారుణంగా ...

news

#U19WorldCup : రాహుల్ ద్రావిడ్ పంట పండింది

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన ఫైనల్ పోరులో భారత యువ ఆటగాళ్లు ...

news

గ్రేట్ టీమ్ వర్క్... యువ భారత్‌కు జేజేలు : సచిన్ ట్వీట్ (వీడియో)

భారత యువ క్రికెటర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపారు. "గ్రేట్ టీమ్ ...

news

చరిత్ర సృష్టించిన భారత కుర్రోళ్ళు: అండర్-19 వరల్డ్ కప్ కైవసం

భారత యువ క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అండర్-19 వరల్డ్ కప్‌ను మరోమారు తమ వశం ...

Widgets Magazine