Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాశ్మీర్‌పై నోరుపారేసుకున్న అఫ్రిది.. దిమ్మదిరిగే బదులిచ్చిన గంభీర్, కోహ్లీ

బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:08 IST)

Widgets Magazine

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత ఆక్రమిత కాశ్మీర్‌లో ఇంత హింస చోటుచేసుకుంటున్నా.. ఐక్యరాజ్యసమితి కానీ.. ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఎందుకు మౌనంగా వుంటున్నాయని షాహిద్ అఫ్రిది ప్రశ్నించాడు. కాశ్మీర్‌లో మానవ హక్కులను కాలరాస్తున్నారని.. అమాయకులను హతమారుస్తున్నారని అఫ్రిది మండిపడ్డాడు. స్వాతంత్ర్యం కోరుకుంటున్న కాశ్మీరీల నోళ్లను మూయించేందుకు భారత సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందని అఫ్రిది ఫైర్ అయ్యాడు. 
 
కాగా కాశ్మీర్ విషయంలో భారత సైన్యంపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.అఫ్రిదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గంభీర్‌ను మీడియా ప్రశ్నించగా గంభీర్ స్పందించాడు. 
 
అఫ్రిది ట్వీట్‌‌పై తనను స్పందించాలని టీమిండియా స్పందించాలని మీడియా కోరుతోంది.  దానిపై ఏం కామెంట్ చేయాలి.. అఫ్రిది ఐరాసను స్పందించమంటున్నాడు. బుద్ధిమాంద్యం ఉన్న అఫ్రిదీ దృష్టిలో యూఎన్ అంటే అండర్ నైన్టీన్ అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌‌కు అవుట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాడంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు.
 
షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. షాహిద్ మాటల్లో కరెక్షన్ వుందని.. భారత ఆక్రమిత కాశ్మీర్ కాదని.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ అనాలని గుర్తు చేశాడు. భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమనే విషయాన్ని అఫ్రిది గుర్తు చేసుకోవాలన్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

అఫ్రిదిని చెడుగుడు ఆడుకున్న గంభీర్... భారత్ గురించి ఆ మాట అన్నందుకు...

గౌతం గంభీర్ దేశభక్తి గురించి చెప్పక్కర్లేదు. ఎవరైనా భారత్ గురించి తేడా మాట్లాడితే ...

news

అలా చేసింది వారిద్దరే... హర్యానా హరికేన్ తర్వాత జార్ఖండ్ డైనమేట్... (Video)

దేశానికి ప్రపంచ వన్డే క్రికెట్ కప్‌లను సాధించిన పెట్టినవారిలో హర్యానా హరికేన్ కపిల్ దేవ్, ...

news

ఆరేళ్ల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్.. ఎవరు?

మాస్టర్ బ్లాస్టర్. ఈ పేరు తెలియని వారుండరు. ఆయనెవరో కాదు సచిన్ టెండూల్కర్. పైగా, ఈయన ...

news

స్టీవ్ స్మిత్ క్రికెట్ కిట్‌ను గ్యారేజ్‌లో పడేసిన తండ్రి (Video)

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకొని యేడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ ...

Widgets Magazine