శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (15:28 IST)

బైకు బదులు డబ్బు తీసుకున్న శిఖర్ ధావన్: కారైతే బాగుండేది

క్రికెటర్లకు బైకు, కార్ల పిచ్చి ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే పిచ్చైతే.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కార్లంటే పిచ్చి. అయితే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం బైకులొద్దు. దానికి సరిపడా డబ్బు తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచిన శిఖర్ ధావన్ మూడు మ్యాచ్ లు ఆడి 52.66 సగటుతో ధావన్ 158 పరుగులు సాధించాడు.
 
ఈ స్కోరులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. చివరి వన్డేలో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ బ్యాటింగ్ ప్రదర్శనకు గాను ఓ మోటార్ బైక్‌ను ప్రదానం చేయాలనుకుంది బంగ్లా క్రికెట్ బోర్డు. అయితే, ధావన్ తనకు బైక్ వద్దని, అందుకు సమానమైన నగదు ఇవ్వాలని కోరాడట. దీంతో, చివరి వన్డే అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్‌కు ఓ డమ్మీ కీ బహుకరించారు. 
 
అయితే శిఖర్ ధావన్ తండ్రి మహేంద్ర పాల్ ధావన్ మాత్రం తొలినాళ్లలో బైకులు నడిపేందుకు ఇష్టపడే ధావన్ ప్రస్తుతం టీ వీలర్స్ అంటే పెద్ద లైక్ చేయట్లేదని, కుటుంబం ఉంది కాబట్టి.. కారైతే ఉపయుక్తంగా ఉండేదన్నారు.