శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (18:23 IST)

మళ్లీ నేను ఫామ్‌లోకి రావడానికి నా భార్య సానియానే కారణం!: మాలిక్

తాను పూర్వపు ఫామ్‌లోకి రావడానికి తన భార్య, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జానే కారణమని పాకిస్థాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ తెలిపాడు. ఐదేళ్ల తర్వాత తిరిగి టెస్టు టీమ్‌లో స్థానం సంపాదించుకోవడంపై మాలిక్ హర్షం వ్యక్తం చేశారు. అద్భుత ఫామ్‌తో అలరిస్తున్న మాలిక్ ఈ నెల 13న ఇంగ్లండ్‌తో మొదలయ్యే టెస్టు సిరీస్‌కు పాకిస్థాన్ సెలెక్టర్లు 16వ ఆటగాడిగా ఎంపిక చేశారు. 
 
వాస్తవానికి ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ కోసం గత నెల ప్రకటించిన జట్టులో 33 ఏళ్ల మాలిక్‌కు స్థానం దక్కలేదు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్ అభ్యర్థన మేరకు మాలిక్‌ను టెస్ట్ జట్టులోకి తీసుకున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత జట్టులో అహ్మద్ షెహజాద్, మహమ్మద్ హఫీజ్‌లు పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వేళ సీనియర్ ఆల్‌రౌండర్‌గా మాలిక్ సేవలను ఉపయోగించుకునేందుకు జట్టుకు ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ హరూన్ రషీద్ వెల్లడించాడు.