నలుగురు బ్యాట్స్‌మెన్ల సెంచరీలు.. బంగ్లాదేశ్ ఘోర పరాజయం

సోమవారం, 9 అక్టోబరు 2017 (09:57 IST)

south africa test team

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఏకంగా సెంచరీలు చేశారు. దీంతో క్రికెట్ పసికూన బంగ్లాదేశ్‌పై అరుదైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం 128 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డుగా చరిత్రపుటలకెక్కింది.
 
బ్లోయెంఫోంటెయిన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ స్థాయి ఘన విజయం సాధించడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా, 2001లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో విజయం సాధించగా ఇప్పుడు దానిని తిరగరాసింది. తాజా విజయం  ఆ దేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దది.
 
ఈ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. జట్టులో డీన్ ఎల్గర్ (113), అయిడెన్ మార్కరమ్ (143), హషీం ఆమ్లా (132), ఫా డుప్లెసిస్ (135) సెంచరీలు చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనిపై మరింత చదవండి :  
Bangladesh Win Teset Series South Africa Record Victory

Loading comments ...

క్రికెట్

news

గంగూలీ త్యాగం ధోనీకి వరం .. ఏంటది?

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టులో గొప్ప ఫినిషర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పేరు గడించారు. ...

news

రాంచీ తొలి టీ-20: కోహ్లీ బుల్లెట్ థ్రో అదుర్స్.. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 పోరులో మైదానంలో కోహ్లీ పాదరసంలా కదిలాడు. అద్భుత ...

news

రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా ...

news

ఐసీసీ కొత్త నిబంధనలు.. ఫేక్ ఫీల్డింగ్.. ధోనీకి శిక్ష తప్పదా?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ...