చిక్కుల్లో బెన్ స్టోక్స్... ఒక నిమిషంలో 15 పిడిగుద్దులు (వీడియో)

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (09:58 IST)

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చిక్కుల్లో పడ్డాడు. బిస్ట్రల్‌లో సోమవారం ఒక పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్‌ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం ఎలాంటి చార్జ్‌ లేకుండానే స్టోక్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సన్ న్యూస్‌ పేపర్ బయటపెట్టింది. ఈ వీడియోకి హిట్ ఫర్ సిక్స్ అనే పేరుని పెట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులపై బెన్ స్టోక్స్ పిడిగుద్దులు కురిపిస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. స్టోక్స్‌ దాడి చేసిన వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సోమర్సెట్‌ పోలీసులు తెలిపారు.
 
బెన్ స్టోక్స్ ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక నిమిషంలో 15 పిడిగుద్దులు కురిపించాడంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వీడియో బెన్ స్టోక్స్ దూకుడుని బట్టబయలు చేస్తోంది. 
 
ఈ ఘటన జరుగుతున్నప్పుడు మరో క్రికెటర్ హేల్స్ కూడా అక్కడే ఉన్నాడు. ఒక దశలో స్టోక్స్ ను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఒక దశలో హెల్స్ కూడా ఒకరిపై చేయిచేసుకోవడంతో వీరిద్దరినీ ఒక వన్డేకు దూరం చేస్తూ ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోపై లుక్కేయండి.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

స్టేడియంలో అనుచిత ప్రవర్తన.. రెడ్ కార్డ్ అమలు.. భలే నిర్ణయమన్న సౌరవ్ గంగూలీ

క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఇతర క్రీడాకారులపై అనుచిత ప్రవర్తనకు పాల్పడితే ...

news

ఆటగాళ్లూ జాగ్రత్త!.. దురుసుగా ప్రవర్తిస్తే రెడ్‌కార్డే...

అంతర్జాతీయ క్రికెట్ నియమనిబంధనలను ఐసీసీ మరోసారి సవరించింది. పాతవాటిలో కొన్ని మార్పులు ...

news

ఆస్ట్రేలియా కుర్రోళ్ళు చెత్తగా ఆడుతున్నారు... : హర్భజన్ సింగ్

భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని సభ్యుల ఆటతీరుపై భారత టర్బోనేటర్ ...

news

పాండ్యా ప్రమోషన్‌కు రవిశాస్త్రి కిటుకేనట.. : విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టుకు మరో కపిల్‌దేవ్‌ దొరికాడంటూ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ ...