శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (22:01 IST)

దక్షిణాఫ్రికా సూపర్ విన్: కరేబియన్లను చిత్తుచిత్తుగా ఓడించిన సఫారీలు...!!

ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా శుక్రవారం నాడు సౌత్ ఆఫ్రికా - వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోర పరాజయం చవిచూసింది.

ఇటీవల భారత్ చేతిలో దక్షిణాఫ్రికాకు ఘోరపరాభవం ఎదురైతే.. జింబాబ్వేపై వెస్టిండీస్ రికార్డుల మోత మోగించి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అవే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడగా ఫలితం తారుమారైంది. సఫారీలు కరేబియన్లను చిత్తుచిత్తుగా ఓడించారు. 
 
ప్రపంచ కప్ గ్రూప్-బిలో భాగంగా శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ తేడాతో విండీస్పై ఘనవిజయం సాధించింది. 409 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కరీబియన్లు 33.1 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యారు. విండీస్ కెప్టెన్ హోల్డర్ (56) హాఫ్ సెంచరీ చేయడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. రెండో ఓవర్లో క్రిస్ గేల్ (3)  ఓటమితో విండీస్ పతనం ఆరంభమైంది. అబాట్ వరుస ఓవర్లలో గేల్, శామ్యూల్స్ను అవుట్ చేయడంతో విండీస్కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (5 వికెట్లు) విండీస్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. డివిల్లీర్స్ (66 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 162 నాటౌట్) మెరుపు సెంచరీతో వీరవిహారం చేయగా, ఆమ్లా (65), డుప్లెసిస్ (62), రోసౌ (61) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. డివిల్లీర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.