Widgets Magazine

భారత్‌తో వన్డే సిరీస్ .. శ్రీలంక జట్టు ఇదే

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం భారత్‌తో తలపడుతోన్న శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ చండీమాల్‌ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడ

sri lanka team
pnr| Last Updated: మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:07 IST)
భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం భారత్‌తో తలపడుతోన్న శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న దినేశ్‌ చండీమాల్‌ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. నిర్ణయాత్మక చివరి టెస్టులో చండీమాల్‌ ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
ఈనెల 10 తేదీన ధర్మశాలలో జరిగే వన్డే మ్యాచ్‌తో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఇందులో ఆల్‌రౌండర్‌ అసేలా గుణరత్నే, ఓపెనర్‌ ధనుష్క గుణతిలక తిరిగి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు. జులైలో గాయం కారణంగా జట్టుకు దూరమైన గుణరత్నే తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలను పెరారీకు శ్రీలంక క్రికెట్ బోర్డు అప్పగించింది.

శ్రీలంక వన్డే టీమ్: పెరీరా(కెప్టెన్‌), ఉపుల్‌ తరంగ, ధనుష్క, గుణతిలక, డిక్విలా, సమరవిక్రమ, తిరిమన్నె, మాథ్యూస్‌, గుణరత్నే, చతురంగ డిసిల్వా, సచిత్‌ పతిరానా, అకిల ధనంజయ, జెఫ్రీ వండర్సే, చమీర, సురంగ లక్మల్‌, నువాన్‌ ప్రదీప్‌.


దీనిపై మరింత చదవండి :