Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోహ్లీని నేను వ్యతిరేకించానా? వెంగీ చీఫ్ సెలక్టర్ పదవి ఊడిందా?: శ్రీనివాసన్

శనివారం, 10 మార్చి 2018 (18:34 IST)

Widgets Magazine
virat kohli

టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఆతని భార్య హసీన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో షమీ కాంట్రాక్టును రద్దు చేసింది. ఇంకా పోలీసులు కూడా షమీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. షమీ వివాదం ఓ వైపు నడుస్తుండగా.. మరోవైపు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌ సర్కార్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 
 
ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం అప్పట్లో బీసీసీఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌తో పాటు మహేంద్రసింగ్ ధోని, కోచ్ గ్యారీ కిరిస్టన్‌కి ఇష్టంలేదని వారు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, తమిళనాడుకి చెందిన బద్రీనాథ్‌ని జట్టులోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ మీడియాతో చెప్పారు. వారి ప్రతిపాదనను పక్కనబెట్టి కోహ్లీకి అవకాశం ఇవ్వడంతోనే తనను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి శ్రీనివాసన్ అప్పట్లో తప్పించాడని వెంగ్ సర్కార్ ఆరోపించాడు. 
 
దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ స్పందించాడు. కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాటలో నిజం లేదని శ్రీనివాసరన్ అన్నాడు. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని వెంగ్ సర్కార్ ప్రస్తావించడం సంస్కారం కాదన్నాడు. జట్టు ఎంపికలో తాను జోక్యం చేసుకోలేదని.. వెంగ్ సర్కార్ ఆరోపణల్లో నిజం లేదని శ్రీనివాసన్ కొట్టిపారేశాడు. 
 
అప్పట్లో అతను ముంబయి క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు ఆసక్తి కనబర్చాడు. అందుకే అతడ్ని సెలక్షన్ కమిటీలోకి తీసుకోలేదు. బద్రీనాథ్‌ని పక్కన పెట్టడం వల్లే పదవి పోయిందని చెప్తున్న వెంగ్ సర్కార్ మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నాడు. శ్రీలంక పర్యటన కోసం విరాట్ కోహ్లితో పాటు బద్రీనాథ్‌ని కూడా సెలక్టర్లు ఎంపిక చేసిన విషయాన్ని వెంగ్ సర్కారు మరిచిపోయినట్లున్నాడని శ్రీనివాసన్ దెప్పిపొడిచాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నా భార్య కంటే ధోనీ ఇష్టం.. కానీ భారత్ శత్రుదేశమని?: చికాగో చాచా

పాకిస్థాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) అంటే తెలియని వారుండరు. చికాగో చాచా ...

news

షమీ అలాంటివాడు కాదు.. హసీన్ ఆరోపణలు ఎంత లేటుగా ఎందుకో?

టీమిండియా పేసర్ మహ్మద్ షమీని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వెనకేసుకొచ్చారు. షమీ తనను ...

news

నేను చావనైనా చస్తానుగానీ.. ఆ పని మాత్రం చేయను : క్రికెటర్ మహ్మద్ షమీ

పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ భారత ...

news

షమీ నన్ను చంపి అక్కడ పాతేయమన్నాడు.. కోహ్లీలా పెళ్లిచేసుకోవాలనుకున్నాడు..

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ...

Widgets Magazine