శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:27 IST)

ఆసియా, ప్రపంచకప్‌లకు టీమిండియా ఎంపిక: కెప్టెన్ కూల్ ధోనీనే సారథి!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ఆసియా కప్, ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌‌లలో ఆడే 15 సభ్యులతో కూడిన  భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పవన్ నేగి, బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీకి స్థానం దక్కింది. ఇక ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లలో ఆడే టీమిండియా జట్లకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహించనున్నాడు.
 
ఈ రెండు క్రికెట్ సిరీస్‌లకు ధోనీనే కెప్టెన్సీ వహించనున్నట్లు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. రెండు సిరీస్‌లకు ఒకే జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌ ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రారంభం కానుండగా, ఆసియా కప్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. 
 
జట్టు వివరాలు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అజింక్యా రెహానే, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పవన్ నేగి, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, మొహ్మద్ షమీ, బుమ్రా, పాండ్యా.