Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

మంగళవారం, 14 నవంబరు 2017 (08:52 IST)

Widgets Magazine
team india

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ టీమిండియాకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశీయంగా జరిగే సిరీస్‌లకు కూడా విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో  ప్రయాణించవచ్చంటూ తీపి కబురు అందించింది. దీంతో భారత జట్టు సభ్యులు ఎగిరి గంతేస్తున్నారు. స్వదేశీ సిరీస్‌లలో ఒక్క కెప్టెన్, కోచ్‌లకు మాత్రమే ఇప్పటి వరకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు దీనిని అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  
 
ఎకానమీ క్లాస్‌లో ప్రయాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తోటి ప్రయాణికులు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారని.. అంతేగాకుండా కాళ్లు పెట్టుకునేందుకు చోటు కూడా ఉండట్లేదని జట్టు సభ్యులు పలుమార్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన బీసీసీఐ ఈ విషయాన్ని సీఓఏ కమిటీలో ప్రస్తావించి బిజినెస్ క్లాస్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఇందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. భారత్-శ్రీలంక మధ్య ఈనెల 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ జరగనుంది. ఇందుకోసం భారత జట్టులోని క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. కోచ్ రవిశాస్త్రి, ఆటగాళ్లు ఉమేశ్ యాదవ్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రహానే తదితరులు కోల్‌కతా చేరుకోగా కెప్టెన్ కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు నేడు రానున్నారు. హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి పేరుతో ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

దారుణ స్థితిలో శ్రీలంక టీమ్ : దుమారం రేపిన భజ్జీ ట్వీట్

శ్రీలంక క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ఓ ట్వీట్ ...

news

23న ఇంటివాడు కానున్న క్రికెటర్ భువనేశ్వర్

భారత క్రికెట్ జట్టులో ఉన్న యువ క్రికెటర్లలో భువనేశ్వర్ ఒకరు. ఈ క్రికెటర్‌కు పెళ్లి ఫిక్స్ ...

news

ధోనీ నాశనం కోరుకుంటావా లక్ష్మణ్? రవిశాస్త్రి ఫైర్, ఏంటబ్బా?

సహజమే. కెప్టెన్‌గా వున్నప్పుడు ఒకలా జట్టు సభ్యుడిగా మారిపోతే ఇంకోలా. నాలుకే కదా ఎలాబడితే ...

news

క్రికెట్ దిగ్గజం మిల్కా సింగ్ ఇకలేరు...

భారత మాజీ టెస్ట్ క్రికెటర్ మిల్కా సింగ్ ఇకలేరు. ఆయన శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ...

Widgets Magazine