శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 4 ఫిబ్రవరి 2017 (08:09 IST)

వారణాసిలో వేదిక్ క్రికెట్.. సంస్కృతంలో కామెంటరీ..కొత్త మజా

వేద విద్యార్థులు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అని అడుగుతారేమే.. అడక్కుండానే ఆ పనిచేసి చూపించేశారు. కాశీలోని సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో జిల్లా స్తాయి ఇంటర్ కాలేజి క్రికెట్ పోటీలు జరుగతుండగా ప్రేక్షకులు సరికొత్త క్రికెట్‌ ఆటను వీక్షిస్త

వేద విద్యార్థులు క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అని అడుగుతారేమే.. అడక్కుండానే ఆ పనిచేసి చూపించేశారు. కాశీలోని సంపూర్ణానంద్ సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో జిల్లా స్తాయి ఇంటర్ కాలేజి క్రికెట్ పోటీలు జరుగతుండగా ప్రేక్షకులు సరికొత్త క్రికెట్‌ ఆటను వీక్షిస్తూ మజా చేశారు. పసుపు, కాషాయ రంగులోని సాంప్రదాయికమైన భారతీయ ధోతీ, కుర్తా ధరించిన వేదవిద్యార్థులు క్రికెట్ ఆడుతుంటే కామెంటరీ కూడా సంస్కృతంలో చెప్పి మరీ ఆనందింప జేశారు.  బయటివారికి ఒక్క ముక్క అర్థం కాకున్నా ఈ వేది విద్యార్థుల సరికొత్త క్రికెట్ బాగానే ఆలరిస్తోందట
 
ఎతి క్రికిదాహ్ చత్రాహ్ దండచాలనార్థమ్ ఆగమిష్యంతి (విద్యార్థి బ్యాటింగ్ క్రీజుకు వస్తున్నాడు), ఎతి చత్రాహ్ కందుక్  కందుక్ క్రీడనార్థమ్ ఆగమిష్యంతి (మరొకరు బౌలింగ్ వేయడానికి వస్తున్నారు.) చతుర్థంక లబ్ధాహ్ (నాలుగు పరుగులు వచ్చాయి) అంటూ లౌడ్ స్పీకర్లలో ప్రతిద్వనిస్తుంటే చాలా కొత్తగానూ, వింతగానూ వినిపించిందట.
 
పైగా ధోతీ కుర్తా ధరించిన వేదవిద్యార్థులు, సంస్కృత పండితులు క్రికెట్ పిచ్ వద్దకు రాగానే ప్రేక్షకులు ఈ సరికొత్త క్రికెట్‌ను బాగానే ఆస్వాదించారు. సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ అయిన శస్త్రార్థ మహావిద్యాలయ 73వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ఇంటర్ కాలేజి క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించారు. సంస్కృతం అంటే కేవలం సారస్వత భాషే కాదు. దానితో చాలా  ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పడానికి వీరు ప్రతి ఏటా  పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారట.