Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

29 యేళ్ల వయసు.. 9 యేళ్ళ కెరీర్... 50 సెంచరీలు.. ఎవరు?

మంగళవారం, 21 నవంబరు 2017 (10:36 IST)

Widgets Magazine
virat kohli

విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఫార్మెట్ ఏదైనా దూకుడే ఆయుధంగా ఎంచుకుని పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో సెంచరీని తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
 
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో చేరాడు. 29 యేళ్ల వయసులో 9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లోనే కోహ్లీ ఈ తరహా రికార్డును చేరుకోవడం అదో ప్రత్యేక రికార్డు కావడం గమనార్హం. 
 
వన్డేల్లో 32 సెంచరీలు... టెస్టుల్లో 18 సెంచరీలు... కలుపుకుని తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 50 సెంచరీలు పూర్తి చేసి.. ఇంకా సెంచరీల వేట కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు.
 
శ్రీలంకతో ముగిసిన కోల్‌కతా టెస్ట్‌లోనూ కొహ్లీ సెంచరీతో చెలరేగాడు. అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను పోటీలో నిలిపాడు. లక్మల్‌ బౌలింగ్‌లో కవర్స్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌తో ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో ఎంటరయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 50 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన 8వ బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
 
ఇప్పటితరంలో హషీమ్‌ ఆమ్లా తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన 2వ క్రికెటర్‌గా విరాట్‌ రికార్డ్‌ల కెక్కాడు. భారత క్రికెట్‌ గాడ్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండుల్కర్ తర్వాత 50 అంతర్జాతీయి సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌గా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ధోనీని తొలగించాలని డిమాండ్.. కపిల్ దేవ్ ఏమన్నాడంటే?

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు ...

news

కోల్‌కతా టెస్ట్ : నిలకడగా భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన ...

news

శోభనం రోజు కాదు తర్వాత రోజు బ్యాటింగ్ చేశాం.. సీక్రెట్ వెల్లడించిన అశ్విన్ భార్య

భారత క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌ స్థాయిగా ఎందిగిన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ఈయన ...

news

కోల్‌కతా టెస్టు: శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 294 ఆలౌట్

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తన తొలి ...

Widgets Magazine