విరాట్ - అనుష్కల పెళ్లి రిసెప్షన్‌లో ప్రధాని మోడీ సందడి

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (09:51 IST)

ఇటీవల పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క వివాహ రిసెప్షన్ కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీ చాణక్యపురిలోని తాజ్ హోటల్ దర్బార్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార, క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు. అందరికంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకకు వచ్చి కొత్త జంటకు తన ఆశీస్సులను అందజేశారు. విరాట్ తల్లి సరోజ్ కోహ్లీ, సోదరి భావన, బావ సంజయ్ దింగ్రా, సోదరుడు వికాస్, వదిన చేతనా కోహ్లీ, మేనళ్లులు, మేనకోడల్లు, అనుష్క తల్లిదండ్రులు ఆషిమా, అజయ్ శర్మ, సోదరుడు కర్నేష్ కూడా ఈ విందుకు విచ్చేశారు.
modi with virushka
 
కాగా, ఈ వివాహ రిసెప్షన్‌కు రావాలని విరుష్క దంపతులు ప్రత్యేకంగా ప్రధాని మోడీని కలిసి ఆహ్వానించిన విషయం తెల్సిందే. దీంతో మోడీ ఈ రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా, ఈ నెల 26న ముంబైలో రెండో విందు పూర్తయ్యాక వీరిద్దరూ దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్నారు. రెండో హనీమూన్‌తో పాటు నూతన సంవత్సర వేడురలను సైతం వారు అక్కడే జరుపుకోనున్నట్టు సమాచారం. కాగా, ఎరుపు, బంగారం వర్ణంతో కూడిన బనారసీ చీరలో అనుష్క, బందుగలా బ్లాక్ కోట్, సిల్క్ కుర్తా దానిపైనా ఎంబ్రాయిడరీతో చేసిన పష్మినా షాలువాతో విరాట్ మెరిసిపోయారు.
modi with virushkaదీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మోదీని కలిసిన విరుష్క జంట... ద్యాముడా... కామెంట్లు దంచేస్తున్నారుగా....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విరుష్క జంట కలిసి పెళ్లి విందు ఆహ్వాన పత్రిక వున్న బ్యాగును ...

news

బ్రాండ్ విలువలో విరాట్ కోహ్లీ టాప్.. మోదీని కలిసిన కొత్త జంట..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ పెరుగుతోంది. దేశంలోనే అత్యంత విలువైన ...

news

భారత బౌలర్ల మాయాజాలం ... లంకను కుమ్మేశారు : టీ20లో భారత్ గెలుపు

భారత బౌలర్లు మరోమారు తమ చేతి మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు. ఫలితంగా పర్యాటక శ్రీలంక ...

విశాఖలో ధావన్ ధమాకా.. సిరీస్ కైవసం భారత్ వశం (హైలైట్స్ వీడియో)

విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. దీంతో ...