శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 నవంబరు 2015 (13:44 IST)

మా దేశంలో సిరిస్ ఆడితే మీకే మంచిది : పాకిస్థాన్‌కు బీసీసీఐ

తమ దేశంలో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడితో పాకిస్థాన్‌కు ఎంతో మేలు చేస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో తటస్థ వేదిక దుబాయ్ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి వుంది. అయితే, సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు యధేచ్చగా కాల్పులకు తెగబడుతున్నాడు. దీంతో ఈ సిరీస్‌‌లో పాల్గొనేందుకు బీసీసీఐకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 
 
ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ భారత్‌లో సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరిస్తేనే, ఇరుదేశాల మధ్య క్రికెట్ పునరుద్ధరణపై చర్చలకు సిద్ధమవుతామన్నారు. పాక్‌లోగానీ, తటస్థ వేదికలపైగానీ పాక్‌తో సిరీస్ ఆడేందుకు తమ ప్రభుత్వం అనుమతించదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ పునరుద్ధరణ కోసమే భారత్‌లో సిరీస్ ఆడాల్సిందిగా దాయాది దేశాన్ని కోరినట్టు చెప్పారు. ఈ సిరీస్ జరిగితే సందిగ్ధంలో ఉన్న ద్వైపాక్షిక సిరీస్ కోసం శాశ్వాత పరిష్కారాలు వెతకడంలో ముందడుగు పడినట్టు అవుతుంది అని ఠాకూర్ పేర్కొన్నాడు.