శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (17:57 IST)

జట్టు ఎంపికతో సంబంధం లేదన్న ద్రవిడ్: కాంబినేషన్ సెట్ కాలేదన్న కోహ్లీ!

జట్టు ఎంపికలో తన ప్రమేయం ఉండదని.. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇవ్వడం వరకే తనకు తెలుసునని అండర్-19 క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టు ఎంపికలో భాగంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో తాను కలగజేసుకునే ప్రసక్తే ఉండదని ద్రవిడ్ తేల్చి చెప్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లతో భారత్ సిరీస్ ఆడుతోంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భారత్ ఉపయోగించుకుంటోంది.
 
ఇదిలా ఉంటే.. అమిత్ మిశ్రాను పక్కన పెట్టి స్టువర్ట్ బిన్నీని ఎంపిక చేయడంపై వచ్చిన విమర్శలకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. జట్టు అవసరాలకు తగినట్లు మార్పులు చేర్పులు జరుగుతుంటాయన్నాడు. గత కొన్నేళ్లుగా అమిత్ మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, పరిస్థితులకు అనుగుణంగా రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీలను సెలెక్టర్లు ఎంపిక చేశారని కోహ్లీ తెలిపాడు.

ఈ పరిస్థితిని మిశ్రా అర్థం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాంబినేషన్ సెట్ కాలేదు కనుక ప్రయోగాలు చేస్తున్నామని, అది జట్టుకు లాభిస్తుందని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.