శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2016 (13:31 IST)

అగ్రరాజ్యం అమెరికాలో క్రికెట్ సందడి.. భారత్-వెస్టిండీస్‌ల మధ్య టీ-20 గెలుపెవరిదో?

అగ్రరాజ్యం అమెరికా వేదికగా భారత్- వెస్టిండీస్‌ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. తద్వారా అమెరికాలో క్రికెట్ సందడి మొదలు కానుంది. అమెరికా, ఫ్లోరిడాలోని లాండర్‌హిల్ నగరంలోని సెంట్రల్ బ్రోవర్ట్ రీజినల్ పార్క్

అగ్రరాజ్యం అమెరికా వేదికగా భారత్- వెస్టిండీస్‌ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. తద్వారా అమెరికాలో క్రికెట్ సందడి మొదలు కానుంది. అమెరికా, ఫ్లోరిడాలోని లాండర్‌హిల్ నగరంలోని సెంట్రల్ బ్రోవర్ట్ రీజినల్ పార్క్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. యూఎస్‌లో టీమిండియాకు ఇదే తొలి అధికారిక సిరీస్ కావడం విశేషం. టీమిండియా- వెస్టిండీస్‌ల మధ్య శనివారం తొలి మ్యాచ్ జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌పై ధోనీ స్పందిస్తూ.. అమెరికా గడ్డపై తాము తొలిసారి ఆడబోతున్నట్లు చెప్పాడు. భారత్‌తో పాటు ఆసియా వాసులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని, యూఎస్‌లో క్రికెట్‌కు ఇదొక కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్టు తెలిపాడు. అలాగే సిరీస్ ప్రసారం సమయం కూడా కొలిసొచ్చే అంశమని, ఈ స్టేడియం కాస్త చిన్నదిగా ఉన్నప్పటికీ, సౌకర్యాలు మాత్రం మెరుగ్గా ఉన్నట్లు ధోనీ చెప్పుకొచ్చాడు.
 
ఇకపోతే.. ఎడారి నగరమైన షార్జాలో క్రికెట్ సిరీస్ నిర్వహించి సక్సెస్ అయిన ఐసీసీ.. అమెరికాలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో రెండుసార్లు ఐసీసీకి అడ్డంకులు ఎదురైనా.. ఈసారి బీసీసీఐ, విండీస్ బోర్డుల సహకారంతో మరోసారి అమెరికాకు క్రికెట్ రుచి చూపెట్టేందుకు ఐసీసీ రెడీ అయ్యింది. అమెరికాలోని ప్రవాస భారతీయులు, ఆసియా దేశస్తులను దృష్టిలో పెట్టుకుని టీ-20 సిరీస్‌కు ఐసీసీ చేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది.