వామికా అంటే దుర్గాదేవి.. నా కూతురు ఫోటోలు అందుకే బయటపెట్టను!?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ దంపతులు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. అయితే తమ గారాల పట్టి ఫోటోలను ఇప్పటివరకు ఈ జంట బయటపెట్టలేదు. కాగా తన కూతురు 'వామికా' ఫొటోలు బయటపెట్టకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలియజేశాడు.
ప్రస్తుతం ప్రతిష్టాత్మక వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సిద్దం అవుతున్న విరాట్.. ముంబై వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో క్వారంటైన్ పాటిస్తున్నాడు.
ఈ క్వారంటైన్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. 'In quarantine.. Ask me your questions' అనే క్యాప్షన్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు.
అయితే ఈ చిట్ చాట్ సందర్భంగా ఓ అభిమాని విరాట్ కోహ్లీ ముందు తన గారాల పట్టి వామికా గురించి ప్రస్తావించాడు. అసలు వామికా' అంటే అర్థం ఏంటని? ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించాడు. దీనికి విరాట్ స్పందిస్తూ.. వామికా అంటే దుర్గాదేవి అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.