శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (11:21 IST)

ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా మోర్గాన్: కుక్ స్థానంలో ఎంపిక!

ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా మోర్గాన్ ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలిస్టర్ కుక్ స్థానంలో అతన్ని ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. 
 
వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కుక్... ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరాశ కలిగించిందని కుక్ అన్నాడు. 
 
ఇకపోతే.. టెస్టు జట్టు కెప్టెన్‌గా మాత్రం కుక్‌నే కొనసాగించనున్నారు. గత 22 వన్డేల్లో ఒకే ఒక్క అర్ధసెంచరీ చేసిన కుక్... ఇటీవల లంకతో జరిగిన సిరీస్‌ను 2-5తో కోల్పోవడంతో అతని కెప్టెన్సీపై ఈసీబీ వేటు వేసింది.