శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (18:13 IST)

నాడు కపిల్ - నేడు ధోనీ : లార్డ్స్‌లో రవీంద్ర జడేజా క్రీడాస్ఫూర్తి

ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన మొదటి టెస్టు సమయంలో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, లార్డ్స్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జడెజా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. భారత్ గెలిచిన వెంటనే అక్కడే ఉన్న అండర్స్‌తో జడెజా చేయి కలిపాడు.
 
కాగా, జడెజా, అండర్సన్ గొడవకు సంబంధించి వీడియో ఆధారాలు లేవట. నాడు కపిల్.. నేడు ధోనీ లార్డ్స్‌లో భారత్ ఇంతకుముందు 16 మ్యాచులు ఆడింది. అందులో గెలిచింది ఒక్కటే. ఇప్పుడు 17వ మ్యాచ్ ధోనీ సారథ్యంలో గెలిచింది. 28 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ సారథ్యంలో చారిత్రక లార్డ్స్ గెలిచిన భారత్, మళ్లీ ఇప్పుడు గెలిచింది. 
 
1986లో జూన్ 5-10 తేదీల మధ్య జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 294 పరుగులు చేయగా.. భారత్ 341 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 180 పరుగులకు కుప్పకూలగా, 134 పరుగుల లక్ష్యాన్ని కపిల్ సేన 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
కాగా, లార్డ్స్‌లో భారత్ గెలుపులో ఇషాంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇషాంత్ 7 వికెట్లు తీసి 74 పరుగులు చేశాడు. ఇషాంత్‌కు ఓ టెస్టులో ఇదే అత్యుత్తమ ప్రతిభ. 
 
లార్డ్స్‌లోను ఓ భారత బౌలర్ అత్యుత్తమ గణాంకాలు ఇవే. 2005లో ఇర్ఫాన్ హరారేలో 7/59 తర్వాత ఓ భారత పేసర్ ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. విజయంపై ధోనీ హర్ష్యం వ్యక్తం చేశాడు. లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయాన్ని సాధించామని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.
 
2011 టూర్‌లో ఎదురైన పరాభవాలు ఎన్నో పాఠాలు నేర్పాయని మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని ధోనీ ప్రశంసించాడు.