శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 అక్టోబరు 2014 (16:56 IST)

కెవిన్ పీటర్సన్ ఆటోబయోగ్రఫీ.. ద్రావిడ్ సహజసిద్ధ గురువు!

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ తన జీవిత చరిత్ర "కేపీ"ను బహిర్గతం చేశారు. ఇందులో అనేక అంశాలపై తన మనస్సులోని మాటను వెల్లడించారు. ముఖ్యంగా భారతీయ క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను వేనోళ్ళ కొనియాడాడు. ద్రావిడ్ ఓ సహజసిద్ద గురువు అని, తనకెంతో సాయపడ్డాడని పేర్కొన్నాడు.
 
స్పిన్‌ను ఎదుర్కొనే విషయంలో టెక్నిక్‌ను మెరుగుపర్చుకోవడంపై ద్రావిడ్ అమూల్యమైన సలహాలు ఇచ్చాడని తెలిపాడు. స్పిన్‌ను ఎదుర్కొనడంలో ద్రావిడ్ మేటి అని కితాబిచ్చిన కేపీ, అతనిచ్చిన సూచనల ఫలితంగానే ఆటను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలిగానని చెప్పుకొచ్చాడు. తాము ఈ-మెయిళ్ళ ద్వారా సంభాషించుకునేవారమని తెలిపిన కేపీ, ఈ మేరకు ద్రావిడ్ మెయిల్‌ను కూడా తన పుస్తకంలో పొందుపరిచాడు. 
 
కేపీ నువ్వు నిజంగా మంచి ఆటగాడివి. బంతిని సునిశితంగా పరిశీలించాలి, అదేసమయంలో నీపై నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. స్పిన్ ఆడలేవని నిన్ను వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు. నువ్వు స్పిన్‌ను సమర్థంగా ఆడగలవు అని ఆ మెయిల్‌లో ద్రావిడ్ సలహా ఇచ్చినట్టు కేపీ తన జీవిత చరిత్ర పుస్తకంలో పేర్కొన్నాడు.