శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (14:42 IST)

శ్రీనివాసన్‌కు భంగపాటు తప్పదా? నెం.2, 3 ప్లేయర్లు ఎవరు?

ఐపీఎల్ ఫిక్సింగ్‌పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది.  ఐపీఎల్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ నివేదికపై సుప్రీం కోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది. ఫలితంగా మరోసారి బిసిసిఐ అధ్యక్షుడు కావాలని ఆశపడుతోన్న శ్రీనివాసన్‌కు భంగపాటు తప్పదని వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్గా శ్రీనివాసన్ ఎలా వ్యవహరిస్తారని ఇప్పటికే సుప్రీం కోర్టు నిలదీసిన తరుణంలో ఆయనకు కష్టాలు తప్పవని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. 
 
ఇక ముద్గల్ కమిటీలో శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్కు బుకీలతో సంబంధాలున్నాయని తేలిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో శ్రీనివాసన్ తనకున్న వాటాల వివరాలను కోర్టు ముందుంచాలని సుప్రీం ఆదేశించింది.
 
అలాగే ముద్గల్ కమిటీ నివేదికపై తక్షణమే చర్యలు తీసుకుని దోషులను బయట పెట్టాలని సుప్రీం ఆదేశిస్తోంది. ప్రత్యేకించి బీసీసీఐ దాచిపెడుతోన్న నంబర్ టూ, నంబర్ త్రీ ప్లేయర్ల పేర్లు బయట పెట్టాలని న్యాయస్థానం ఆదేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ప్రక్షాళనే అజెండా కావాలని సుప్రీం ఇప్పటికే స్పష్టం చేసింది.