శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (12:41 IST)

సచిన్‌కు అరుదైన గౌరవం : బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో చోటు!

భారత క్రికెట్ లెజెండ్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ క్రమంలో సచిన్‌కు బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో అతనికి చోటు లభించింది. చారిత్రక సిడ్నీ మైదానంలో నిర్వహించిన విందుకు సచిన్‌తో కలిసి ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా హాజరయ్యాడు. 
 
1998లో బ్రాడ్‌మన్ 90వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నప్పుడు సచిన్ అతనిని కలిశాడు. ఆ సమయంలో బ్రాడ్‌మన్ మాట్లాడుతూ సచిన్ ఆటను చూసినప్పుడు తాను ఆడే విధానాన్ని తానే చూస్తున్నట్టు కనిపిస్తుందని కొనియాడాడు. 
 
ఆ విషయాన్ని సచిన్ గుర్తు చేసుకుంటూ... ఒక క్రికెటర్‌కు ఇంతకు మించిన ప్రశంస మరొకటి ఉండదన్నాడు. బ్రాడ్‌మన్ ఫౌండేషన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కడం తన అదృష్టమని చెప్పాడు.

1998లో అడిలైడ్‌లోని బ్రాడ్‌మన్ నివాసంలో తాను కలిసినప్పుడు తనతో పాటు వార్న్ కూడా ఉన్నాడని, ఎవరు ముందు ఆ దిగ్గజంతో మాట్లాడాలో తేల్చుకోలేకపోయామన్నాడు.

నీది ఆస్ట్రేలియా కాబట్టి ముందు నువ్వు మాట్లాడమని వార్న్‌తో తాను అన్నానని, నువ్వు బ్యాట్స్‌మన్‌వి కాబట్టి బ్రాడ్‌మన్‌తో నాకన్నా నువ్వు బాగా మాట్లాడగలవని వార్న్ తనతో అన్నాడని సచిన్ నాటి గుర్తులను పల్లె వేశాడు.